వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట మండల:కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు రూ.2.50 లక్షల విలువచేసే వస్తు సామాగ్రిని జల్లి జిల్లా పరిషత్ పాఠశాల రిటైర్డ్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పుల్లూరి జగన్మోహన్ బహుకరించారు.
- తెల్సా తెలుగు అమెరికా అసోసియేషన్ వారి సహకారంతో రిటైర్డ్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పుల్లూరి జగన్మోహన్ పాఠశాలకు 50 ఫ్యాన్లు, వంట సామాగ్రి అయిన గ్రైండర్, మిక్సీ, విద్యార్థినిల దాహార్తిని తీర్చే వాటర్ కూలర్ ఫ్రిడ్జ్, 20 కుర్చీలు మొత్తం రూ.2లక్షల 50 వేల విలువైన వస్తు…
- ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు జగన్మోహన్ కు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి, ఉపాధ్యాయునీలు, విద్యార్థినిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నారావుపేట మండల:కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు రూ.2.50 లక్షల విలువచేసే వస్తు సామాగ్రిని జల్లి జిల్లా పరిషత్ పాఠశాల రిటైర్డ్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పుల్లూరి జగన్మోహన్ బహుకరించారు. తెల్సా తెలుగు అమెరికా అసోసియేషన్ వారి సహకారంతో రిటైర్డ్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పుల్లూరి జగన్మోహన్ పాఠశాలకు 50 ఫ్యాన్లు, వంట సామాగ్రి అయిన గ్రైండర్, మిక్సీ, విద్యార్థినిల దాహార్తిని తీర్చే వాటర్ కూలర్ ఫ్రిడ్జ్, 20 కుర్చీలు మొత్తం రూ.2లక్షల 50 వేల విలువైన వస్తు సామాగ్రిని గురువారం పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు జగన్మోహన్ కు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి, ఉపాధ్యాయునీలు, విద్యార్థినిలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిని పాపమ్మ, జల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్ది వెంకటేశ్వర్లు, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ మెట్టుపల్లి జ్యోతి, ఉపాధ్యాయునిలు, విద్యార్థినులు పాల్గొన్నారు.