వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట మండలంలోని చెరువు కొమ్ము.తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ భూక్య మహబూబ్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెన్నారావు పేట వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
- గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సరోజ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
- ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
చెన్నరావుపేట మండలంలోని చెరువు కొమ్ము.తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ భూక్య మహబూబ్ సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెన్నారావు పేట వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని సరోజ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్పంచ్ మహబూబ్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, సూపర్వైజర్ కీర్య, హెల్త్ అసిస్టెంట్లు శివాజీ, సురేందర్, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్లు సునీత, ఉమ, వార్డు సభ్యులు గ్రామస్తులు, జిపి సిబ్బంది, పాల్గొన్నారు.