వార్త ముఖ్యాంశాలు
- .నంద్యాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా ఇస్మాయిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు...1996 బ్యాచ్‌కు చెందిన ఇస్మాయిల్ గతంలో నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తో పాటు నంద్యాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించారు.ఆయా విభాగాల్లో సమర్థవంతంగా…
.నంద్యాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా ఇస్మాయిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు…1996 బ్యాచ్‌కు చెందిన ఇస్మాయిల్ గతంలో నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తో పాటు నంద్యాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించారు.ఆయా విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి,పోలీసు శాఖలో తనదైన గుర్తింపు పొందినట్లు సిబ్బంది పేర్కొన్నారు..!!బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ ఇస్మాయిల్ పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు,సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు,పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులు,ఇతర పోలీస్‌స్టేషన్ కార్యకలాపాలపై ప్రాథమికంగా ఆరా తీశారు..!!ఇప్పటికే నంద్యాల పట్టణంలో పనిచేసిన అనుభవం ఉండటంతో వన్‌టౌన్ పరిధిపై ఆయనకు అవగాహన ఉండటం కలిసొచ్చే అంశంగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.నూతన బాధ్యతల్లోనూ సీఐ ఇస్మాయిల్ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు..!!*.వన్‌టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఇస్మాయిల్‌కు పోలీస్ అధికారులు,సిబ్బంది అభినందనలు తెలిపారు..!!