అమలాపురం: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించనున్న సెపక్ తక్రా ఛాంపియన్షిప్–2026 పోస్టర్ను చెరుకూరి సాయిరాం ఆవిష్కరించారు. అమలాపురంలోని ఎస్.కె.బి.ఆర్. కళాశాల మైదానంలో అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్వాహకులు చెరుకూరి సాయిరాంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, నిర్వాహకులను ఆయన అభినందించారు. క్రీడా కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, యువతకు అండగా నిలవడం, క్రీడా రంగ అభివృద్ధికి తోడ్పడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెరుకూరి సాయిరాం అన్నారు.



