Friday, 2 October 2026
  • Home  
  • *పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం:*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం:*

*అన్నయ్యపేట పాఠశాలలో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ* *విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సుభాష్* *విద్యార్థులతో ముచ్చటించి, సౌకర్యాలపై ఆరా..* డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం అన్నయ్యపేట ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.పాఠశాల ఆవరణ,తరగతి గదులు, పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు, పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి, వారికి అందుతున్న విద్యా సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరంమంత్రి సుభాష్ ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ లు,విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, చిన్న వయస్సు నుంచే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా కృషి చేయాలని,విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు,పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, కూటమి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*అన్నయ్యపేట పాఠశాలలో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ*

*విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సుభాష్*

*విద్యార్థులతో ముచ్చటించి, సౌకర్యాలపై ఆరా..*

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం అన్నయ్యపేట ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.పాఠశాల ఆవరణ,తరగతి గదులు, పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు, పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి, వారికి అందుతున్న విద్యా సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అనంతరంమంత్రి సుభాష్ ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ లు,విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం ద్వారా వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, చిన్న వయస్సు నుంచే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు సూచించారు.
ప్రతి విద్యార్థి తన ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా కృషి చేయాలని,విద్యతో పాటు మంచి విలువలను అలవర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు,పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, కూటమి పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.