Thursday, 1 October 2026
  • Home  
  • బాసర మండల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష… పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…
- నిర్మల్

బాసర మండల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష… పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…

బాసర మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, పెండింగ్ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, శాఖలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గ్రామపంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

బాసర మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, పెండింగ్ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, శాఖలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గ్రామపంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.