Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ.. పల్లె పండుగ–3.0లో అభివృద్ధి పనులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పశువుల షెడ్ల నిర్మాణానికి భూమిపూజ.. పల్లె పండుగ–3.0లో అభివృద్ధి పనులకు శ్రీకారం

వార్త ముఖ్యాంశాలు

  • పశుపోషకులకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం రైల్వేకోడూరు: రైల్వేకోడూరు మండలం వీపీర్‌ కండ్రిగ పంచాయతీ పరిధిలోని లక్ష్మిగార్డెన్‌ ఎస్టీ కాలనీలో పల్లె పండుగ–3.0లో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు.
  • వి.బి.జి.
  • రామ్‌జీ నిధులతో చేపట్టనున్న ఈ పనులను రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్‌ ముక్కా రూపానంద రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రారంభించారు.

పశుపోషకులకు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

రైల్వేకోడూరు: రైల్వేకోడూరు మండలం వీపీర్‌ కండ్రిగ పంచాయతీ పరిధిలోని లక్ష్మిగార్డెన్‌ ఎస్టీ కాలనీలో పల్లె పండుగ–3.0లో భాగంగా పశువుల షెడ్ల నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. వి.బి.జి. రామ్‌జీ నిధులతో చేపట్టనున్న ఈ పనులను రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్‌ ముక్కా రూపానంద రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుపోషకులకు మౌలిక వసతులు కల్పించడంతో పశువుల సంరక్షణకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పశుపోషణ గ్రామీణ కుటుంబాలకు ఆదాయ వనరుగా నిలుస్తున్న నేపథ్యంలో షెడ్ల నిర్మాణం వారికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో మృత్యుంజయ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *