Thursday, 1 October 2026
  • Home  
  • పోలూరులో ఘనంగా ‘పల్లె పండుగ 3.0’ – సీసీ రోడ్ల శంకుస్థాపన, మినీ గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
- నంద్యాల

పోలూరులో ఘనంగా ‘పల్లె పండుగ 3.0’ – సీసీ రోడ్ల శంకుస్థాపన, మినీ గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల :గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు . గురువారం నంద్యాల మండలం పోలూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) సంయుక్త ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.మినీ గోకులం షెడ్ల ప్రారంభం:* ‘వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ – జిఆర్ఏఎం జి ) పథకంలో భాగంగా గ్రామంలో నిర్మించిన మినీ గోకులం షెడ్లను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. పాడి రైతుల సంక్షేమానికి, పశువుల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.నూతన సీసీ రోడ్లు, కాలువలకు శంకుస్థాపన:* గ్రామంలో అంతర్గత రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు మంత్రి ఫరూక్ శాస్త్రోక్తంగా భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామని, ప్రతి గ్రామాన్ని స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నాణ్యతతో కూడిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పోలూరు గ్రామ టిడిపి నాయకులు పైరెడ్డి జోజీ రెడ్డి, జయ చంద్రారెడ్డి , కిరణ్ కుమార్ రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మండలం టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, అర్ఫాత్ బాషా, అబ్దుల్లా, రామిరెడ్డి , హుస్సేన్ బాషా, అలీ అక్బర్ , ఖాదర్ బాషా, రాజా రెడ్డి , అర్షద్ బాషా, భూపాల్ రెడ్డి, అరుణ, సునీత మరియు ఎమ్మార్వో శ్రీవాణి, ఎంపీడీవో సుగుణ శ్రీ , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు, సచివాలయ సిబ్బంది , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.