సమస్యల తిష్ట.. అడవిని తలపిస్తున్న పాఠశాల ఆవరణం
గేటు, కిటికీలు లేక అవస్థలు..బూజు పట్టి అధ్వానంగా మారిన,వంటగది
ఆత్మకూరు: మండలంలోని బసవరాజుపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యలతో సతమతమవుతోంది. పాఠశాలకు సరైన గేటు కూడా లేకపోవడంతో కుక్కలు, పందులు తరచూ ఆవరణలోకి ప్రవేశించి సంచరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాఠశాల చుట్టూ చెట్లు, కొమ్మలు అల్లుకొని ఆవరణ మొత్తం అడవిని తలపిస్తోంది. మరోవైపు మరుగుదొడ్లు అధ్వానంగా మారాయి. తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో భద్రత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
*బూజు పట్టిన వంటగది.. పగుళ్లతో గోడలు*
పాఠశాల వంటగది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోడలకు బూజు పట్టడంతో పాటు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పేరుకే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అని, లోపలికి వెళ్తే సమస్యలే కనిపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణపై యాజమాన్యం,సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి,పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:


