గూడూరు: పున్నమి ప్రతినిధి కటకం. విజయ కుమార్
నెల్లూరు జిల్లా లోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక “గూడూరు ఆంజనేయ స్వామి జెండా పండుగ” కు సర్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జెండా మహోత్సవాన్ని అక్టోబర్ 10 మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలు, ఉత్సవ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ పండుగను వీక్షించేందుకు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. పట్టణంలోని తూర్పు వీధి, కుమ్మరి వీధి, గామళ్లపాలెం వీధులలో ఎత్తైన పోల్లపై భారీ ఆంజనేయ స్వామి జెండాలను ప్రతిష్టించడం ఈ ఉత్సవం యొక్క ప్రధాన విశిష్టత. భక్తిశ్రద్ధలతో, డప్పు వాయిద్యాల నడుమ ఈ జెండాలను ఎగురవేస్తారు.


