Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 365 కిలోలు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 365 కిలోలు స్వాధీనం

భద్రాచలం /ఖమ్మం

అబ్కారీ శాఖ అధికారులు సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. మొత్తం 365 కిలోల గంజాయితో పాటు మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ఒడిశా నుంచి బైక్, కారు, లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తుండగా భద్రాచలం, ఖమ్మం ప్రాంతాల్లో అధికారులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. అక్రమంగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు సమన్వయంతో తనిఖీలు నిర్వహించిన అబ్కారీ సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు.

ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 365 కిలోలు స్వాధీనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *