Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రహదారిపై రెండు బైక్‌లు ఢీ.. తెదేపా నాయకుడు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రహదారిపై రెండు బైక్‌లు ఢీ.. తెదేపా నాయకుడు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • కొడవలూరు: రామన్నపాళెం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెదేపా నాయకుడు, ముదివర్తి నీటిసంఘం ఉపాధ్యక్షుడు తాతా శ్రీహరి (35) మృతిచెందారు.
  • పోలీసుల వివరాల ప్రకారం..
  • విడవలూరు మండలం అన్నారెడ్డిపాళేనికి చెందిన శ్రీహరి మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు.

కొడవలూరు: రామన్నపాళెం జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెదేపా నాయకుడు, ముదివర్తి నీటిసంఘం ఉపాధ్యక్షుడు తాతా శ్రీహరి (35) మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళేనికి చెందిన శ్రీహరి మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై నెల్లూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో నార్తురాజుపాళెంలో నివసిస్తున్న అస్సాంకు చెందిన బోరో జునలి తన తమ్ముడు రాజుతో కలిసి విధులకు వెళ్తున్నారు. రామన్నపాళెం వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో శ్రీహరి అక్కడికక్కడే మృతిచెందారు. జునలి, రాజుకు తీవ్రగాయాలు కావడంతో నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *