Thursday, 1 October 2026
  • Home  
  • దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం యాత్రకు ఘన స్వాగతం
- రంగారెడ్డి

దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం యాత్రకు ఘన స్వాగతం

హైదరాబాద్: దివ్యాంగుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన యాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. కర్నూలులో ప్రారంభమైన యాత్ర విజయవాడ మీదుగా మూడు రోజుల ప్రయాణం అనంతరం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంను పలువురు నాయకులు కలిసి యాత్రకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, వేణు గౌడ్, ఎం.ఎస్. యాదవ్, సతీష్ మహాజన్‌తో పాటు వివిధ బీసీ, ఎస్సీ, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & జ్యువెలర్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు, అసోసియేషన్ సభ్యులు యాత్రికులను సన్మానించారు. అనంతరం మర్చంట్ కమిటీ సభ్యులు మురళి, తడ్క శంకర్, ఏరు నరసింహ, గుర్రం నరసింహ, జెల శ్రీనివాస్, పెద్ద శివదాస్, శ్యామ్ కుమార్, జోర్ల వెంకటేష్ తదితరులను సన్మానించారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన హామీల అమలుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.

హైదరాబాద్: దివ్యాంగుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన యాత్ర హైదరాబాద్‌కు చేరుకుంది. కర్నూలులో ప్రారంభమైన యాత్ర విజయవాడ మీదుగా మూడు రోజుల ప్రయాణం అనంతరం నగరానికి చేరుకుంది.
ఈ సందర్భంగా కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంను పలువురు నాయకులు కలిసి యాత్రకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని వారు అభినందించారు.
కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, వేణు గౌడ్, ఎం.ఎస్. యాదవ్, సతీష్ మహాజన్‌తో పాటు వివిధ బీసీ, ఎస్సీ, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ & జ్యువెలర్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు, అసోసియేషన్ సభ్యులు యాత్రికులను సన్మానించారు.
అనంతరం మర్చంట్ కమిటీ సభ్యులు మురళి, తడ్క శంకర్, ఏరు నరసింహ, గుర్రం నరసింహ, జెల శ్రీనివాస్, పెద్ద శివదాస్, శ్యామ్ కుమార్, జోర్ల వెంకటేష్ తదితరులను సన్మానించారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కులు, సంక్షేమానికి సంబంధించిన హామీల అమలుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.