Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పట్టభద్రుల ఓటర్ల నమోదుపై కలెక్టర్ దృష్టి 2 లక్షల ఓటర్ల నమోదే లక్ష్యం: దివాకర్ టి.ఎస్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టభద్రుల ఓటర్ల నమోదుపై కలెక్టర్ దృష్టి 2 లక్షల ఓటర్ల నమోదే లక్ష్యం: దివాకర్ టి.ఎస్.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఓటర్ల నమోదుపై బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన కలెక్టర్ గతంలో ఉన్న సుమారు 84 వేల మంది పట్టభద్రుల ఓటర్ల సంఖ్యను పెంచి, ఈసారి 2 లక్షల మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. అర్హులైన పట్టభద్రులు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఓటరు నమోదుకు అవసరమైన ఫారం–18 సమర్పించేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు దివాకర్ టి.ఎస్. వెల్లడించారు.

పట్టభద్రుల ఓటర్ల నమోదుపై కలెక్టర్ దృష్టి 2 లక్షల ఓటర్ల నమోదే లక్ష్యం: దివాకర్ టి.ఎస్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *