అనంతసాగరం సెప్టెంబర్ 30,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరంలోని వికాస్ స్కూల్ నందు ఎస్ఎల్ సి (స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి -1 ఓరుగంటి నారాయణ ప్రారంభించి విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను ప్రశంసించారు. ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో మండల జనవిజ్ఞాన వేదిక నాయకులు వేము. పెంచలయ్య, వికాస్ స్కూల్ కరెస్పాండెంట్ షేక్. ఖాదర్ వలి ,డైరెక్టర్ షేక్. జిలానీభాష, హెచ్ఎం గుత్తి. పెంచలప్రసాద్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


