నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఇరు పార్టీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించకుండా కాలయాపన చేయడం వెనుక స్వార్థ రాజకీయాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజారోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా రాజకీయాలను పక్కనపెట్టి క్రిటికల్ కేర్ సెంటర్ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభంలో జాప్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యే చేతగానితనానికి నిదర్శనం: ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ నేటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సయ్యద్ హైదర్ విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఇరు పార్టీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించకుండా కాలయాపన చేయడం వెనుక స్వార్థ రాజకీయాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజారోగ్యం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా రాజకీయాలను పక్కనపెట్టి క్రిటికల్ కేర్ సెంటర్ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

