Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముద్దాయికి శిక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముద్దాయికి శిక్ష

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) రాజమండ్రిలో చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
  • డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముమ్మిడివరం (M) ప్రాంతానికి చెందిన రాజపూడి విజయానాథ్ మూర్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు తెలియవచ్చినది.
  • వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రిలో చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు లేని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో ముమ్మిడివరం (M) ప్రాంతానికి చెందిన రాజపూడి విజయానాథ్ మూర్తికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు తెలియవచ్చినది.

వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన కాశీ విశ్వేశ్వరరావుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి నిందితుడు చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు చెల్లకుండా తిరిగి వచ్చింది. దీంతో బాధితుడు న్యాయపరమైన చర్యలను ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం, చెక్కు బౌన్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, ఫిర్యాదుదారుకు రూ.10 వేల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *