Wednesday, 30 September 2026
  • Home  
  • స్వచ్ఛ నిర్మల్‌కు ప్రజల భాగస్వామ్యం అవసరం – లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్
- నిర్మల్

స్వచ్ఛ నిర్మల్‌కు ప్రజల భాగస్వామ్యం అవసరం – లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్

నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. బుధవారం మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడంతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. బుధవారం మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడంతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.