రామాపురం: వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా విజయవంతమైంది. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ప్రత్యక్ష పర్యవేక్షణలో సుమారు 3,000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హెలిప్యాడ్, వీఐపీ రూట్, కట్ఆఫ్, ట్రాఫిక్ పాయింట్లు, సభా ప్రాంగణం, పార్కింగ్, గ్రీన్రూమ్, సేఫ్హౌస్, సేఫ్ హాస్పిటల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసే వరకు ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
