Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ–3.0కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె పండుగ–3.0కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఘన స్వాగతం

ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ మేకపాటి శాంతికుమారి హృదయపూర్వక స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం కార్యక్రమం నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై వారు పరస్పరం చర్చించారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామాపురం వేదికగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

పల్లె పండుగ–3.0కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఘన స్వాగతం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *