Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కొవ్వూరు లో పుష్కరాల పనులు ప్రారంభించిన యం.ఎల్.ఏ ముప్పిడి…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొవ్వూరు లో పుష్కరాల పనులు ప్రారంభించిన యం.ఎల్.ఏ ముప్పిడి…

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిది కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు పట్టణంలో మంజూరైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
  • ఈరోజు కొవ్వూరు పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్లు మరియు ఏ.ఐ.ఐ.బి పథకం కింద రూ.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులకు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
  • ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

పున్నమి ప్రతినిది కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు పట్టణంలో మంజూరైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈరోజు కొవ్వూరు పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్లు మరియు ఏ.ఐ.ఐ.బి పథకం కింద రూ.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులకు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పుష్కరాల సందర్భంగా కొవ్వూరు పట్టణానికి వచ్చే భక్తులు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు, పట్టణ అభివృద్ధికి ఈ పనులు మరింత దోహదపడతాయని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, కొవ్వూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలోఎన్.డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపాల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *