*ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు*
పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీవాసులు శాసనసభ్యులు అమరనాథ రెడ్డిని మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తమ ప్రాంతంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లను ఏర్పాటు చేయించడాన్ని హర్షిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పూర్తి చేయించి ఇస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు ఆయనకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలియజేసిన వారిలో వెంకటాచలం, ఏ ఆర్ కుమార్, సెందిల్ కుమార్, శ్రీనివాసులు, ఆంజనేయులు, పళని తదితరులు ఉన్నారు..


