*SRI DURGA MALLESWARA SIDDHARTHA MAHILA KALASALA*
*(An Autonomous College in the Jurisdiction of Krishna University, Machilipatnam)*
Venkateswara Puram, Vijayawada – 520 010.
శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 28 మరియు 29 సెప్టెంబర్ తేదీలలో JAMOVI (జామోవి) సాఫ్ట్‌వేర్ పై రెండు రోజుల *Hands on National Workshop* నిర్వహించబడింది.
గణాంక శాస్త్రం (Statistics) ఆధునిక విద్య మరియు పరిశోధనా రంగాలలో ఎంతో ముఖ్యమైనది. గణాంక సమాచారాన్ని సులభంగా, వేగంగా మరియు సమర్థవంతంగా విశ్లేషించడానికి వివిధ గణాంక సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడుతున్నాయి. వాటిలో *JAMOVI Software* విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకులకు సులభంగా ఉపయోగించగల ఒక ముఖ్యమైన గణాంక సాఫ్ట్‌వేర్.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఇన్‌ఛార్జ్ *డాక్టర్ పీ.వీ. దుర్గావతి* గారు పాల్గొని గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను, JAMOVI Software విశిష్టతను వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ అడ్వైజర్ టు ప్రిన్సిపల్, HOD Dept of Physics *వై. గీతా మాధురి గారు గణాంక శాస్త్రంలోని సిద్ధాంత అంశాలను సాఫ్ట్‌వేర్ సహాయంతో ఆచరణాత్మకంగా తీసుకురావడానికి గల అంశాలను వివరించారు.
ఈ సెషన్ లోHOD Dept. of Statistics *G. Chakravarthy*, Academic Officer A.O, *PB Siddhartha College of Arts & Science* గారు గణాంక శాస్త్రంలోని వివిధ ఉపాధి అవకాశాలను మరియు గణాంక శాస్త్రానికి సాఫ్ట్‌వేర్ రంగంలోనిl విశిష్టతను వివరించారు.
ఈ కార్యక్రమానికి *Dr. R. Vishnu Vardhan, Professor in Rudravaram*, .
Department of Statistics, Ramanujan School of Mathematical Sciences, Pondicherry University నుండి వచ్చిన వారు కళాశాలలో JAMOVI సాఫ్ట్‌వేర్‌ను సంబంధిత అధ్యాపకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు మరియు అధ్యాపకులకు వివరిస్తూ, Excel ద్వారా CSV ఫైల్‌ను ఎలా డేటాను ఎగుమతి చేయవచ్చో తెలియజేసి, ఎలా విశ్లేషణ చేసుకోవాలో ఒకే విధముగా ప్రాక్టికల్‌గా వివరించారు.
రెండు రోజుల JAMOVI వర్క్‌షాప్ ద్వారా గణాంక శాస్త్రంలో R-Language కు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. R-Language లో కోడింగ్ చేసే విధానాన్ని ఉపయోగించడం ద్వారా కూడా వివిధ రకాల విశ్లేషణలు నిర్వహించవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గణాంకశాస్త్ర విభాగాధిపతి, పి మహేశ్వరి అధ్యాపకులు K. రమ్య ,
CH. గ్లోరీ , M. రత్న G. సుమతి స్వరూప మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

