రఘునాథపాలెం /ఖమ్మం
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుపరిపాలన స్ఫూర్తితో బీజేపీ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాలతో రఘునాథపాలెం మండలం చెరువుకొమ్ముతండాలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుత్తా వంశీ, ప్రధాన కార్యదర్శి భూక్యా బాలాజీ ఆధ్వర్యంలో చిన్నారుల పౌష్టికాహారం, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ సిబ్బందితో సమావేశం నిర్వహించి, టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లను సన్మానించారు. ముఖ్య అతిథిగా జిల్లా పరిశీలకురాలు, SIR రాష్ట్ర కో-కన్వీనర్ వీణ సేవక్, జిల్లా SIR పరిశీలకులు ప్రభాకర్, SIR జిల్లా కన్వీనర్ శ్యామ్ రాథోడ్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, గంధసిరి వీరభద్రం గౌడ్, ధర్మాసోత్ రామారావు, లకావత్ రమేష్, లకావత్ నవీన్, అయిలా నరేష్, పోలేబోయిన నాగేశ్వర్రావు, కేలోత్ సుమన్, బొడ్డు నాగేశ్వర్రావు, భూక్యా గాంధీ నాయక్, గుగులోత్ హత్తిరామ్ పాల్గొన్నారు.
