Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అమలాపురంలో 2K వాక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అమలాపురంలో 2K వాక్

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ఇందులో భాగంగా ఎస్‌కేబీఆర్ కళాశాల నుంచి గడియారం స్తంభం వరకు 2K వాక్ నిర్వహించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్‌కేబీఆర్ కళాశాల నుంచి గడియారం స్తంభం వరకు 2K వాక్ నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం తీసుకురావడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు హరీష్ బాలయోగి, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, సినీ నటి మెహరీన్ ఫిర్జాదా, మిస్ యూనివర్స్ ఇండియా సృజనా దేవి, స్థానిక డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పార్టీ నాయకులు అనుచూరి రామపురుషోత్తం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *