Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మంలో సీఐల బదిలీల కలకలం ముగ్గురికి పోస్టింగ్ లేదు.. ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ ఆదేశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖమ్మంలో సీఐల బదిలీల కలకలం ముగ్గురికి పోస్టింగ్ లేదు.. ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ ఆదేశాలు

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీలు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మల్టీజోన్-1 ఐజీ సంతోష్ చంద్రశేఖర్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పలువురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఖమ్మం II టౌన్ ఎస్‌హెచ్‌ఓ బొమ్మెర బాలకృష్ణ, ఖానాపురం హవేలీ ఎస్‌హెచ్‌ఓ రడం భానుప్రకాష్, ట్రాఫిక్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ బెల్లం సత్యనారాయణలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించకుండా హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అలాగే ఖమ్మం III టౌన్ ఎస్‌హెచ్‌ఓ జిల్లేళ్లమూడి మోహన్‌బాబును కూడా ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

మరోవైపు సీఎస్‌బీలో పనిచేస్తున్న జ్ఞానదృష్టి రామకృష్ణను II టౌన్ ఎస్‌హెచ్‌ఓగా, ఇంటెలిజెన్స్‌ నుంచి ఎండి. సాధిక్ పాషాను I టౌన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. తాటిపాముల కరుణాకర్‌ను విఆర్‌కు పంపి రఘునాథపాలెం పీఎస్‌కు అటాచ్ చేశారు. ఉమెన్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓ నల్లమోతు చిట్టిబాబును III టౌన్ ఎస్‌హెచ్‌ఓగా, సిటిసీలోని కాగిటోజు శివప్రసాద్‌ను ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఒకేసారి జరిగిన ఈ బదిలీలు ఖమ్మంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

ఖమ్మంలో సీఐల బదిలీల కలకలం ముగ్గురికి పోస్టింగ్ లేదు.. ఐజీ కార్యాలయానికి రిపోర్ట్ ఆదేశాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *