Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఓటు హక్కు కాపాడాలి.. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి: ప్రజా సంఘాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఓటు హక్కు కాపాడాలి.. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి: ప్రజా సంఘాలు

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు: భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా రైల్వేకోడూరు సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
  • భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కును పరిరక్షించేందుకు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు.

రైల్వేకోడూరు: భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా రైల్వేకోడూరు సీఐటీయూ కార్యాలయంలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కును పరిరక్షించేందుకు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్‌, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ నాయకులు సీహెచ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయని వచ్చిన నివేదికలపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, కొత్త ఓటర్ల నమోదులో అడ్డంకులు తొలగించాలని కోరారు.
ఎన్నికల కమిషన్‌ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోరారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కేవీపీఎస్‌, రైతు, వ్యవసాయ కార్మిక, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *