Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం ఆశావహులతో సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం ఆశావహులతో సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖ గాజువాక : సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

గాజువాక నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డులకు టీడీపీ కార్పొరేటర్‌ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులతో పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆశావహులతో విస్తృతంగా చర్చించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కూటమి పార్టీల మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందించుకుని, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.

ఈ సమావేశంలో టీడీపీ ముఖ్య నాయకులు, వివిధ వార్డుల నుంచి కార్పొరేటర్‌ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం ఆశావహులతో సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం ఆశావహులతో సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *