Wednesday, 30 September 2026
  • Home  
  • సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ
- ఎన్ టి ఆర్ జిల్లా

సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

నందిగామ ప్రతినిధి నిర్మాణ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ.. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా గతంలోఅమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు నిర్మాణ కార్మికుడు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. సంక్షేమ బోర్డుకు సంబంధిం చిన పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు నమోదులు, రెన్యువల్స్‌కు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిం టినీ పునరుద్ధరించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీసుల వద్ద నిర్వహించే ధర్నాను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కె.గోపాల్ పిలుపునిచ్చారు.అదేవిధంగా అక్టోబర్ 8న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను కూడా జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పత్తి హరిబాబు, బెల్లంకొండ రాంబాబు, రాము, కిరణ్, పరమేష్, శివయ్యతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

నందిగామ ప్రతినిధి

నిర్మాణ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ.. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా గతంలోఅమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు నిర్మాణ కార్మికుడు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.
సంక్షేమ బోర్డుకు సంబంధిం చిన పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు నమోదులు, రెన్యువల్స్‌కు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నిం టినీ పునరుద్ధరించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీసుల వద్ద నిర్వహించే ధర్నాను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కె.గోపాల్ పిలుపునిచ్చారు.అదేవిధంగా అక్టోబర్ 8న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను కూడా జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పత్తి హరిబాబు, బెల్లంకొండ రాంబాబు, రాము, కిరణ్, పరమేష్, శివయ్యతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.