Wednesday, 30 September 2026
  • Home  
  • చిన్నారుల భవితకు అంగనవాడిల అండ… సేవలకు ఘన నిరాజనం
- విశాఖపట్నం

చిన్నారుల భవితకు అంగనవాడిల అండ… సేవలకు ఘన నిరాజనం

46 అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి సత్కారం.. మధురవాడలో వైభవంగా సేవా సంకల్ప ఉత్సవం విశాఖపట్నం జిల్లా,మధురవాడ, సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి): చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, గర్భిణులు, బాలింతల సంక్షేమానికి నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు అనన్యసామాన్యమని బీజేపీ నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సోమవారం మధురవాడ వాంబే కాలనీలో అంగన్వాడీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వత్సవాయి రోహిణి ఆధ్వర్యంలో, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 46 కేంద్రాల సిబ్బందికి ఘన సత్కారం మధురవాడ, ఎండాడ, సింహాచలం ప్రాంతాలకు చెందిన 46 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణుల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. గర్భిణులకు శ్రీమంతం.. చిన్నారులకు అన్నప్రాశన ఉత్సవంలో భాగంగా గర్భిణులకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో వాంబే కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పాల్గొన్న బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ కేశవకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జీ. ప్రేమకుమారి, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చక్రవర్తి, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సిటీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి రమణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు స్పందన, రత్నం, మధురవాడ మండల అధ్యక్షుడు అప్పారావు, ఎండాడ మండల అధ్యక్షుడు నాగరాజు, మధురవాడ మండల కార్యదర్శి పావని తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీల సేవలకు గుర్తింపు, సిబ్బందికి గౌరవం కల్పిస్తూ నిర్వహించిన ఈ ఉత్సవం సేవా సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

46 అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి సత్కారం.. మధురవాడలో వైభవంగా సేవా సంకల్ప ఉత్సవం

విశాఖపట్నం జిల్లా,మధురవాడ, సెప్టెంబర్ 28 (పున్నమి ప్రతినిధి):

చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, గర్భిణులు, బాలింతల సంక్షేమానికి నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలు అనన్యసామాన్యమని బీజేపీ నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సోమవారం మధురవాడ వాంబే కాలనీలో అంగన్వాడీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వత్సవాయి రోహిణి ఆధ్వర్యంలో, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

46 కేంద్రాల సిబ్బందికి ఘన సత్కారం

మధురవాడ, ఎండాడ, సింహాచలం ప్రాంతాలకు చెందిన 46 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణుల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషిని నాయకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

గర్భిణులకు శ్రీమంతం.. చిన్నారులకు అన్నప్రాశన

ఉత్సవంలో భాగంగా గర్భిణులకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో వాంబే కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

పాల్గొన్న బీజేపీ నాయకులు

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ కేశవకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జీ. ప్రేమకుమారి, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చక్రవర్తి, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సిటీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి రమణి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు స్పందన, రత్నం, మధురవాడ మండల అధ్యక్షుడు అప్పారావు, ఎండాడ మండల అధ్యక్షుడు నాగరాజు, మధురవాడ మండల కార్యదర్శి పావని తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంగన్వాడీల సేవలకు గుర్తింపు, సిబ్బందికి గౌరవం కల్పిస్తూ నిర్వహించిన ఈ ఉత్సవం సేవా సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.