బోనకల్/ ఖమ్మం
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బీజేపీ మాజీ అధ్యక్షులు వీరపనేని అప్పారావు మాతృమూర్తి వీరపనేని భద్రమ్మ / మరణ వార్త తెలుసు కొని రావినూతల గ్రామం లొ గల వీరపనేని అప్పారావ్ స్వగృహం కి వెళ్లి /భద్రమ్మ
పార్ధివదేహానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు నివాళులర్పించారు. పాలేరు అసెంబ్లీ బీజేపీ ఇంచార్జి నున్న రవికుమార్, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా శ్యామ్ సుందర్ నాయక్, మధిర అసెంబ్లీ నాయకులు నాగేశ్వరరావు, గుగులోత్ నాగేశ్వరరావు, తాల్లూరి సురేష్ తదితరులు భద్రమ్మ పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



