Monday, 28 September 2026
  • Home  
  • ఆడబిడ్డల విద్యకు బలమైన పునాది.. రూ.2.12 కోట్ల భవనం
- తిరుపతి

ఆడబిడ్డల విద్యకు బలమైన పునాది.. రూ.2.12 కోట్ల భవనం

చిట్వేల్: మండలంలోని సి.కందులవారిపల్లి పంచాయతీలో రూ.2.12 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభమైంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించి విద్యార్థినులకు కల్పించిన తరగతి గదులు, వసతులు, విద్యా సౌకర్యాలపై ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడం ద్వారా విద్యాభ్యాసానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. విద్యార్థినులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.