విశాఖపట్నం జిల్లా,( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 28::
విశాఖపట్నంలోని విప్రో క్యాంపస్లో విప్రో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “Spirit of Wipro Run 2026” కార్యక్రమంలో భాగంగా వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో దియా పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్రో సంస్థకు చెందిన 105 మంది ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని మట్టి ప్రమిదలకు వివిధ రంగులతో అందమైన పెయింటింగ్లు వేశారు. విప్రో ఫౌండేషన్ ప్రతినిధి అంతరా మాట్లాడుతూ, విప్రో వాలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉద్యోగుల సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతీక అని తెలిపారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు సహాయం చేయడంలో విప్రో ఉద్యోగులు ముందుండటం అభినందనీయమన్నారు.
వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ, విప్రో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంతో పెయింట్ చేసిన ఈ ప్రమిదలను రాబోయే దీపావళి పండుగ సందర్భంగా పేద మహిళలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పండుగ ఆనందాన్ని పేద మహిళలతో పంచుకోవడంతో పాటు, వారికి ఉపాధి మరియు ఆదాయానికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కుషల్ కార్యక్రమం ప్రాజెక్ట్ ఆఫీసర్ వరలక్ష్మి, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఉష, భవాని, పార్వతి, శర్మిల, లక్ష్మి, కలావతి, కామాక్షి, అన్నయ్యబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో విప్రో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో దీపావళి దీపావళి పెయింటింగ్ కార్యక్రమం
విశాఖపట్నం జిల్లా,( పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 28:: విశాఖపట్నంలోని విప్రో క్యాంపస్లో విప్రో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “Spirit of Wipro Run 2026” కార్యక్రమంలో భాగంగా వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో దియా పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్రో సంస్థకు చెందిన 105 మంది ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని మట్టి ప్రమిదలకు వివిధ రంగులతో అందమైన పెయింటింగ్లు వేశారు. విప్రో ఫౌండేషన్ ప్రతినిధి అంతరా మాట్లాడుతూ, విప్రో వాలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉద్యోగుల సామాజిక బాధ్యత పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతీక అని తెలిపారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు సహాయం చేయడంలో విప్రో ఉద్యోగులు ముందుండటం అభినందనీయమన్నారు. వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎం. అబ్రహాం మాట్లాడుతూ, విప్రో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంతో పెయింట్ చేసిన ఈ ప్రమిదలను రాబోయే దీపావళి పండుగ సందర్భంగా పేద మహిళలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పండుగ ఆనందాన్ని పేద మహిళలతో పంచుకోవడంతో పాటు, వారికి ఉపాధి మరియు ఆదాయానికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుషల్ కార్యక్రమం ప్రాజెక్ట్ ఆఫీసర్ వరలక్ష్మి, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఉష, భవాని, పార్వతి, శర్మిల, లక్ష్మి, కలావతి, కామాక్షి, అన్నయ్యబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో విప్రో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.

