: ఆశా వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు, ఆశా యూనియన్ గౌరవ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించారు. బీఆర్‌టీయూ జిల్లా నాయకులు పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. సంతోష, మాజీ నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొన్నారు. సమావేశంలో ఆశా కార్యకర్తల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు.



