Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

నాగోల్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నాగోల్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

నాగోల్: నాగోల్‌లోని పీఎంఆర్ కన్వెన్షన్‌లో ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీగిరి తరుణి, శ్రీగిరి వెంకట మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తులు, చీరలు, జ్యువెలరీ, హోమ్ అప్లయన్సెస్ తదితర వస్తువులతో మొత్తం 88 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
‘సఖి బజార్’ 29వ సీజన్‌గా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.2 వేలకే ఆరు చీరలు, కాంచీ చీరలపై ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్, రూ.10 వేల విలువైన ఇమిటేషన్ జ్యువెలరీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్, రూ.10 వేల చీరల కొనుగోలుపై హోమ్ అప్లయన్సెస్ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.నాగోల్ పరిసర ప్రాంతాల మహిళలు, ఫ్యాషన్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.తదుపరి ప్రదర్శన: ‘సఖి బజార్’ తదుపరి ఎగ్జిబిషన్ అక్టోబర్ 3, 4 తేదీల్లో బండ్లగూడలోని సన్‌సిటీ కేకే కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నాగోల్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సఖి బజార్’ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *