Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

భక్తిశ్రద్ధలతో శంఖు చక్ర నామాల ఏర్పాటుకు భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భక్తిశ్రద్ధలతో శంఖు చక్ర నామాల ఏర్పాటుకు భూమిపూజ

ఖమ్మం ఖానాపూరం నందు గల ప్రసిద్ధి చెందిన
స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు భక్తుల సౌకర్యార్థం శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. శ్యామల శ్రీనివాస్ రెడ్డి దంపతుల సహకారంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. ఆలయ ప్రాంగణంలో శంఖు, చక్ర, నామాల ఏర్పాటు ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అల్లిక అంజయ్యతో పాటు సభ్యులు, భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.

భక్తిశ్రద్ధలతో శంఖు చక్ర నామాల ఏర్పాటుకు భూమిపూజ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *