ఖమ్మం:నగరం లోని గట్టయ్య సెంటర్‌లోని కవిత కాలేజీ నుంచి కొత్త మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై అపోలో ఫార్మసీ మూల మలుపు వద్ద నుండి సితార టి కేఫ్త వరకు తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వాహనదారులు అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనాల వేగం నియంత్రించకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు స్పందించి అపోలో ఫార్మసీ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు వేగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
