ఖమ్మం: నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని, ప్రజాసేవలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
