ఖమ్మం, సారధి నగర్: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ నిర్వహించిన టైప్ రైటింగ్ జూనియర్ గ్రేడ్ పరీక్షల్లో ఖమ్మం నగరానికి చెందిన బాబా టైప్ రైటింగ్ & షార్ట్ హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థిని కావేటి హాసిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. 7వ తరగతి ఉత్తీర్ణతతో పరీక్షకు హాజరైన హాసినిని ఖమ్మం జిల్లా BRS నాయకులు, మాజీ కార్పొరేటర్ తోట రామారావు అభినందించి ఉత్తీర్ణత పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తోట రామారావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టైపింగ్ నైపుణ్యానికి ప్రతి రంగంలో ప్రాధాన్యత పెరిగిందన్నారు. విద్యార్థులకు టైపింగ్ నేర్పించేందుకు కృషి చేస్తున్న బాబా టైప్ రైటింగ్ & షార్ట్ హ్యాండ్ ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ బాబాను అభినందించారు. కార్యక్రమంలో వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్, అబ్దుల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.



