Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

జల్లేపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జల్లేపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

రూ.1.11 లక్షలకు మూడు లడ్డూల వేలం

జల్లేపల్లి: గ్రామంలోని బీసీ కాలనీలో వీరన్న యువసేన యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పూర్తికావడంతో మూడు లడ్డూలకు వేలంపాట నిర్వహించారు.

పెద్ద లడ్డూను భాషబోయిన వీరవెంకటరామ్ కుటుంబ సభ్యులు రూ.84,006కు, రెండో లడ్డూను ఇండ్ల సురేష్ కుటుంబ సభ్యులు రూ.22,016కు, మూడో లడ్డూను అల్లి వెంకన్న కుటుంబ సభ్యులు రూ.5,116కు దక్కించుకున్నారు. మూడు లడ్డూలకు కలిపి రూ.1,11,138 వేలం ఆదాయం లభించింది.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జల్లేపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *