Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న మర్రి రత్నకుమార్‌ను మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న మర్రి రత్నకుమార్‌ను మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శ

వార్త ముఖ్యాంశాలు

  • డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరులోని సాయి విశ్వాస్ హాస్పిటల్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న దేవగుప్తం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మర్రి రత్నకుమార్‌ను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ పరామర్శించారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరులోని సాయి విశ్వాస్ హాస్పిటల్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న దేవగుప్తం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మర్రి రత్నకుమార్‌ను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె రత్నకుమార్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రత్నకుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనురాధ పరామర్శతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రత్నకుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *