వార్త ముఖ్యాంశాలు
- మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ రాజంపేట: కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్.
- సవితమ్మను టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
- కడప ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన భేటీలో రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ
త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ
రాజంపేట: కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవితమ్మను టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కడప ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన భేటీలో రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమస్యలను సవివరంగా విన్న మంత్రి సవితమ్మ సానుకూలంగా స్పందించినట్లు శివప్రసాద్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.