Saturday, 26 September 2026
  • Home  
  • ఆర్టీసీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఐఎన్‌టీయూసీతో కలిసి పనిచేయాలి: నూతి సత్యనారాయణ గౌడ్
- ఖమ్మం

ఆర్టీసీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ఐఎన్‌టీయూసీతో కలిసి పనిచేయాలి: నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం: ఆర్టీసీ ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక సంజీవరెడ్డి భవన్‌లో జరిగిన సమావేశంలో జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు కొత్త సీతారాములు, అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, డిపో గౌరవ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 27న ఉదయం 9:30 గంటలకు ఖమ్మం బస్ డిపో వద్ద ఐఎన్‌టీయూసీ జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నరేష్ మోహన్ నాయుడు, హనుమంతరావు, వినోద్ రావు, ఉపేందర్ రెడ్డి, అంజయ్య, యాదగిరి, వీరభద్రరావు, శ్రీనివాస్, సురేష్, మూడుముంతల గంగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.