Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కుబీర్‌లో ప్రశాంతంగా పూర్తయిన కర్ర గణపయ్య నిమజ్జనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • కుబీర్‌లోని విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన కర్ర గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా పూర్తయింది.
  • భజన కార్యక్రమాలతో ప్రత్యేక పల్లకిలో గణపయ్యను ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు.
  • శోభాయాత్రలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

కుబీర్‌లోని విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన కర్ర గణపయ్య నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య ప్రశాంతంగా పూర్తయింది. భజన కార్యక్రమాలతో ప్రత్యేక పల్లకిలో గణపయ్యను ఊరేగిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు గణపయ్యకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక వాగు వద్దకు చేరుకున్న భక్తులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాగులోని నీటిని గణపయ్యపై చల్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కర్ర గణపయ్యను తిరిగి సంప్రదాయబద్ధంగా భద్రపరిచారు. ప్రతీఏటా కర్ర గణపయ్యను నిమజ్జనం చేయకుండా భద్రపరచడం ఆనవాయితీగా కొనసాగుతోంది. గ్రామస్థుల భక్తి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *