అంబేద్కర్ కోనసీమ జిల్లా: కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదు పాడిగేదెలు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా విద్యుత్ వైరును కిందకు వదిలివేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగను గుర్తించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువులే జీవనాధారంగా ఉన్న రైతు పాలెపు రామకృష్ణకు ఐదు గేదెలు మృతిచెందడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపి, బాధిత రైతుకు తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Uploaded Video:

