Saturday, 26 September 2026
  • Home  
  • పంటలు పండాల్సిన నేలలో.. అపాచీ పరిశ్రమ వ్యర్థాల మంటలు
- తిరుపతి

పంటలు పండాల్సిన నేలలో.. అపాచీ పరిశ్రమ వ్యర్థాల మంటలు

– *పులివేంద్రలో పొలాల వద్ద వ్యర్థాల దహనం* – *వ్యర్థాలపై అడిడాస్, అపాచీ గుర్తులు* – *పొగతో రైతులు, కార్మికుల అవస్థలు* – *కాలువల్లోకి వ్యర్థాల నీరు* *సూళ్లూరుపేట, సెప్టెంబరు 25 * పంటలు పండాల్సిన భూముల్లో పారిశ్రామిక వ్యర్థాలు మండుతున్నాయి. గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలకు నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడుతుండగా.. దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన పరిసరాలను కమ్ముకుంటోంది. వర్షం కురుస్తున్నా వ్యర్థాల దహనం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తిరుపతి జిల్లా తడ మండలం పులివేంద్ర వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా, రైల్వే మార్గం పక్కన పంట పొలాలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో మాంబట్టు పారిశ్రామిక వాడలోని అపాచీ పాదరక్షల పరిశ్రమ వ్యర్థాలను పెద్దఎత్తున తీసుకొచ్చి బహిరంగంగా తగలబెడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాలుతున్న వ్యర్థాలపై అడిడాస్, అపాచీ పేర్లు, గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాత్రింబవళ్లు తేడా లేకుండా వ్యర్థాలను ఇక్కడికి తరలించి దహనం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలను బయటకు తరలించేందుకు సంబంధితులకు నెలనెలా భారీ మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారని, ఆ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్దేశిత వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించి అక్కడే నిర్వహించాల్సి ఉన్నా.. పులివేంద్రలోని పంట పొలాల వద్దకు తీసుకొచ్చి తగలబెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కాలడంతో వెలువడే పొగ, దుర్వాసనతో రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలిన వ్యర్థాల నుంచి కరిగి బయటకు వస్తున్న పదార్థాలు, బూడిద వర్షపు నీటితో కలిసి సమీప పంట పొలాలు, కాలువల్లోకి చేరుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాలువల్లోని నీటిని తాగే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సమీప రైల్వే మార్గం వద్ద మరమ్మతులు, వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు సైతం పొగ, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. పంట పొలాలకు ఆనుకుని ఇంత పెద్దఎత్తున వ్యర్థాలను పగలు, రాత్రి తేడా లేకుండా బహిరంగంగా తగలబెడుతున్నా సంబంధిత అధికారులు కట్టడి చర్యలు చేపట్టకపోవడంపై రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉండగా, వాటిని పంట భూముల మధ్యకు తీసుకొచ్చి దహనం చేయడం వల్ల వ్యవసాయ భూములు, కాలువలు, పశువులు ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులివేంద్రలో జరుగుతున్న వ్యర్థాల దహనాన్ని తక్షణమే నిలిపివేసి, వ్యర్థాల తరలింపు, నిర్వహణపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

– *పులివేంద్రలో పొలాల వద్ద వ్యర్థాల దహనం*
– *వ్యర్థాలపై అడిడాస్, అపాచీ గుర్తులు*
– *పొగతో రైతులు, కార్మికుల అవస్థలు*
– *కాలువల్లోకి వ్యర్థాల నీరు*

*సూళ్లూరుపేట, సెప్టెంబరు 25 * పంటలు పండాల్సిన భూముల్లో పారిశ్రామిక వ్యర్థాలు మండుతున్నాయి. గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలకు నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడుతుండగా.. దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన పరిసరాలను కమ్ముకుంటోంది. వర్షం కురుస్తున్నా వ్యర్థాల దహనం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు.

తిరుపతి జిల్లా తడ మండలం పులివేంద్ర వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా, రైల్వే మార్గం పక్కన పంట పొలాలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో మాంబట్టు పారిశ్రామిక వాడలోని అపాచీ పాదరక్షల పరిశ్రమ వ్యర్థాలను పెద్దఎత్తున తీసుకొచ్చి బహిరంగంగా తగలబెడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాలుతున్న వ్యర్థాలపై అడిడాస్, అపాచీ పేర్లు, గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ రాత్రింబవళ్లు తేడా లేకుండా వ్యర్థాలను ఇక్కడికి తరలించి దహనం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమ నుంచి వ్యర్థాలను బయటకు తరలించేందుకు సంబంధితులకు నెలనెలా భారీ మొత్తంలో చెల్లింపులు చేస్తున్నారని, ఆ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్దేశిత వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించి అక్కడే నిర్వహించాల్సి ఉన్నా.. పులివేంద్రలోని పంట పొలాల వద్దకు తీసుకొచ్చి తగలబెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కాలడంతో వెలువడే పొగ, దుర్వాసనతో రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలిన వ్యర్థాల నుంచి కరిగి బయటకు వస్తున్న పదార్థాలు, బూడిద వర్షపు నీటితో కలిసి సమీప పంట పొలాలు, కాలువల్లోకి చేరుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనివల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాలువల్లోని నీటిని తాగే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సమీప రైల్వే మార్గం వద్ద మరమ్మతులు, వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు సైతం పొగ, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. పంట పొలాలకు ఆనుకుని ఇంత పెద్దఎత్తున వ్యర్థాలను పగలు, రాత్రి తేడా లేకుండా బహిరంగంగా తగలబెడుతున్నా సంబంధిత అధికారులు కట్టడి చర్యలు చేపట్టకపోవడంపై రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిశ్రమ వ్యర్థాలను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉండగా, వాటిని పంట భూముల మధ్యకు తీసుకొచ్చి దహనం చేయడం వల్ల వ్యవసాయ భూములు, కాలువలు, పశువులు ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పులివేంద్రలో జరుగుతున్న వ్యర్థాల దహనాన్ని తక్షణమే నిలిపివేసి, వ్యర్థాల తరలింపు, నిర్వహణపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.