Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

వేంసూరు మండలంలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వేంసూరు మండలంలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

వేంసూరు / ఖమ్మం

వేంసూరు మండలం మార్లపాడు గ్రామంలో బీజేపీ వేంసూరు మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సైద్ధాంతిక స్ఫూర్తిదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పాల నాగ సురేంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు యామరపు అప్పారావు, బండి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యాలయ సంయుక్త కార్యదర్శి గొర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు భీమిరెడ్డి బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృషయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు కిన్నెర మహేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు భీమిరెడ్డి సతీ అనసూయదేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

వేంసూరు మండలంలో ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *