Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు: రాఘవ రాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
  • నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • ప్రజలు వివరించిన సమస్యలను క్షుణ్ణంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

రైల్వే కోడూరు: రాఘవ రాజుపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వివరించిన సమస్యలను క్షుణ్ణంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. ఆయా గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ప్రజా దర్బార్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *