Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సఖినేటిపల్లి లంక రేవు – పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య గోదావరి నదిపై నిర్వహించే పడవ, పంటు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సఖినేటిపల్లి లంక రేవు – పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య గోదావరి నదిపై నిర్వహించే పడవ, పంటు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేత

వార్త ముఖ్యాంశాలు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా డాక్టర్ బి.ఆర్.
  • అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక రేవు - పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య గోదావరి నదిపై నిర్వహించే పడవ, పంటు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
  • కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక రేవు – పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య గోదావరి నదిపై నిర్వహించే పడవ, పంటు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణం పూర్తిగా అనుకూలించే వరకు గోదావరి నదిలో పడవ ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితులు చక్కబడిన వెంటనే పడవ రాకపోకలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *