Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రతి కదలికపై కన్ను.. పేటలో పోలీసుల ‘మెగా కవచం’*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రతి కదలికపై కన్ను.. పేటలో పోలీసుల ‘మెగా కవచం’*

వార్త ముఖ్యాంశాలు

  • *- 110 సీసీ కెమెరాలతో పట్టణంపై 24 గంటల నిఘా* *- ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మురళీకృష్ణ ప్రత్యేక చొరవ* *సూళ్లూరుపేట, సెప్టెంబరు 24 నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసు శాఖ..
  • సూళ్లూరుపేట పట్టణానికి నిఘా కవచాన్ని ఏర్పాటు చేసింది.
  • ఎస్పీ ఎల్.

*- 110 సీసీ కెమెరాలతో పట్టణంపై 24 గంటల నిఘా*
*- ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ మురళీకృష్ణ ప్రత్యేక చొరవ*

*సూళ్లూరుపేట, సెప్టెంబరు 24

నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసు శాఖ.. సూళ్లూరుపేట పట్టణానికి నిఘా కవచాన్ని ఏర్పాటు చేసింది. ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు సీఐ ఎం. మురళీకృష్ణ ప్రత్యేక చొరవతో పట్టణంలోని 50 కీలక ప్రాంతాల్లో 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ లాంఛనంగా ప్రారంభించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో జరిగే కదలికలను 24 గంటలపాటు పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించడం, దొంగతనాలు, గొలుసు దొంగతనాలు తదితర నేరాలను అరికట్టడంతో పాటు నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడనున్నాయి.

అదే విధంగా పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులపై కూడా నిఘా కొనసాగనుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ఇళ్ల వద్ద, దుకాణాల వద్ద వీధి వైపు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ప్రజలు, వ్యాపారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ఈ నిఘా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.

*కార్యక్రమంలో సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *